సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనికి గల కారణాలు తెలియల్సి ఉంది.కాగా ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకుతున్న వీడియో వైరల్ అవుతోంది. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)