MLA Durgam Chinnaiah: తెలంగాణ ఎమ్మెల్యే చిన్నయ్య శృంగార లీలలు బయటకు, వరుసగా రెండు వీడియోలను బయటపెట్టిన మహిళ, అమ్మాయిని రాత్రికి పంపించాలంటూ..
durgam-chinnaiah (photo-Video Grab)

Hyd, Mar 28: తెలంగాణలో ఎంఎల్ఏ మీద సెక్సువల్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని ఓ మహిళ వీడియోని విడుదల చేసింది.

ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్‌ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్లను కూడా విడుదల చేశారు.

హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్, వారం రోజుల పాటు భగభగమండే ఎండలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ

మంచిర్యాల జిల్లా బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక ‌ వీడియోను విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె అందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోసాలను బట్ట బయలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేను తాము బ్లాక్ ‌మెయిల్ చేస్తున్నాననేది అబద్దమన్నారు.

Here's Video

ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారన్నారు.. కానీ పోలీసులు తాము పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ పుటేజీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.. తనకు ప్రాణహని ఉందన్నారు. తమకు రక్షణ. కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేకమంది ఉన్నారని వారిపై సమగ్రమైన విచారణ. జరిపించాలని కోరారు.

అమ్మాయి కోసం చాటింగ్‌

డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్‌ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు.

గుడ్ న్యూస్, పాన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం, త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని సూచన

చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్‌వాల్వ్‌ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు.

మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్‌ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్‌ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్‌ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్‌’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం.

నాపై దుష్పప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే

నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను