Telangana Shocker: దారుణం, వసతి గృహంలో 8 ఏళ్ళ అంధ బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వెళితే..

హైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. మలక్ పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న వికారాబాద్ కు చెందిన 8 ఏళ్ల బాలికపై అదే వసతి గృహంలో పని చేసే నరేష్(24) అనే యువకుడు అత్యాచారం చేశాడు.

Telangana Shocker: దారుణం, వసతి గృహంలో 8 ఏళ్ళ అంధ బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వెళితే..
Rape (Rep Image)

Hyd, July 25: హైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. మలక్ పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న వికారాబాద్ కు చెందిన 8 ఏళ్ల బాలికపై అదే వసతి గృహంలో పని చేసే నరేష్(24) అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లకుండా బాలిక తల్లిదండ్రులకు వసతి గృహం సిబ్బంది సమాచారమిచ్చారు

జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో మలక్ పేట్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు కోసం వెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే బాలిక అంధురాలు అని, తాను చూడలేదని, ఆమె చెప్పేదాన్ని నమ్మలేమంటూ, ఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించమంటూ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు.  వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

బాలికకు రక్తస్రావం ఆగకపోవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిలోఫర్ డాక్టర్లు ఘటన అత్యాచార ఘటన అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడు పోలీసులు విచారణ జరిపారు. వసతి గృహంలో పని చేసే నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు . బాలికపై అత్యాచారం జరిగితే పట్టించుకోని వసతి గృహం సిబ్బందిపై, ఫిర్యాదుకు వెళ్తే తీసుకొని మలక్ పేట్ పోలీసులపై తీరా విమర్శలు చేస్తూ స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Jul 25, 2024 04:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).