Telangana Shocker: బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు, ఆ పార్టులో టపాసులు పేల్చి వీడియో తీసిన స్థానిక యువకులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి (cracker-blasted-in-teen-private-part) దాన్ని వీడియో తీసి వైరల్‌ చేశారు

Telangana Shocker: బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు, ఆ పార్టులో టపాసులు పేల్చి వీడియో తీసిన స్థానిక యువకులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
Representational Image | (Photo Credits: IANS)

Hyd, Nov 3: హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి (cracker-blasted-in-teen-private-part) దాన్ని వీడియో తీసి వైరల్‌ చేశారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు.

కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. బాలుడుని కదలకుండా గట్టిగా పట్టుకున్న యువకులు.. వదిలిపెట్టాలని ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు. తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్​ఫోన్ కూడా లాక్కున్నారు.

మద్యానికి బానిసైన కన్న కొడుకును చంపేందుకు రూ.8 లక్షలకు కాంట్రాక్ట్, తల్లిదండ్రులను, కిల్లర్స్ ను అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో విషయం కుటుంబీకులకు చేరింది. సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు.

కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆ కేసును మంగళవారం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 03, 2022 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).