Khammam Shocker: నా సెక్స్ కోరిక తీరుస్తావా లేదా..ఒప్పుకోకపోవడంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వృద్ధుడు, బాడీని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేసిన కామాంధుడు, ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన
Image used for representational purpose (Photo Credits: Pixabay)

Khammam, April 28: ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన (Khammam Shocker) చోటు చేసుకుంది. వృద్ధురాలిని లైంగిక కోర్కె తీర్చకపోవడంతో కామంతో రగిలిపోతున్న వృద్ధుడు ఆమెను కిరాతకంగా హత్య (khammam-man-brutally-assassinated-woman) చేశాడు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేశాడు. ఇల్లెందు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఖమ్మం జిల్లా కారేపల్లి అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్‌ ఓ వృద్ధుడు. అక్కడే జీవనం సాగిస్తున్నాడు.

మండల పరిధిలోని భజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి(70) అనే వృద్ధురాలిని రెండు రోజుల క్రితం కాలనీలోని తన ఇంటి వద్దనే హత్య చేశాడు. కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేసి వాటిని చీమలపాడు అటవీ ప్రాంతంలో కాల్చి వేశాడు. అనంతరం సోమవారం రాత్రి మొండెంను బస్తాలో వేసుకుని మరో యువకుడి సాయంతో తరలించేందుకు ప్రయత్నించాడు.

అయితే యువకుడు ఆ బస్తా గురించి అడగ్గా.. అది అడవి పంది అని, దుర్వాసన వస్తుండటంతో అటవీ అధికారులు చూస్తే కేసు అవుతుందని బయట పడవేస్తున్నానని నమ్మబలికి ఆ యువకుడి సాయంతో మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్‌పై పడవేశారు. అయితే, ఉపేందర్‌ మాటలతో అనుమానం వచ్చిన సదరు యువకుడు మూట విప్పి చూడగా అందులో మొండెం కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు కారేపల్లి పోలీసులకు సమాచారం అందించాడు.

భార్యకు కరోనా వచ్చిందని తల నరికి దారుణ హత్య, అనంతరం బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య, మరో చోట కోవిడ్ సోకిన భర్తను బతికించేకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య

వెంటనే పోలీసులు ఉపేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా.. తాను లైంగిక వాంఛ తీర్చమని అడిగితే తిరస్కరించినందుకే హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని ఇల్లెందు ఏసీపీ వెంకటరెడ్డి, కారేపల్లి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సురేశ్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. క్షుద్ర పూజల నేపథ్యంలోనే వృద్ధురాలిని హత్య చేశారని అక్కడి గ్రామ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపేందర్‌తోపాటు మరికొందరు కూడా ఈ హత్యలో పాలు పంచుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.