Warangal Shocker: ఆర్థిక లావాదేవీల్లో వివాదం, అన్న కుటుంబాన్ని దారుణంగా నరికి చంపేసిన తమ్ముడు, ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్‌లోని ఎల్బీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం (Warangal Shocker) చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని (Three of family murdered brutally) హతమార్చాడు.

Warangal Shocker: ఆర్థిక లావాదేవీల్లో వివాదం, అన్న కుటుంబాన్ని దారుణంగా నరికి చంపేసిన తమ్ముడు, ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, వరంగల్ జిల్లాలో ఘటన
Murder (Photo Credits: Pixabay)

Warangal, Sep 1: వరంగల్‌లోని ఎల్బీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం (Warangal Shocker) చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని (Three of family murdered brutally) హతమార్చాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు (two others injured in Warangal) తీవ్ర గాయాల పాలయ్యారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు ఈ దాడికి పాల్పడ్డాడు.

వరంగల్‌ ఏసీపీ కల్కోట గిరికుమార్‌ ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ ఎల్బీ నగర్‌లో మహమ్మద్‌ చాంద్‌పాషా తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఎల్బీనగర్‌ చెందిన చాంద్‌పాషా తన తమ్ముడు షఫీతో కలిసి పశువుల వ్యాపారం చేస్తున్నాడు. ఏడాదిగా పశువుల వ్యాపారం లావాదేవీల్లో అన్నాదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. సుమారు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం చాంద్‌పాషా ఇంటిలోనే ఆయన కుటుంబంపై దాడి చేశాడు.

తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో షఫీతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాంద్‌పాషా ఇంటి తలుపులను కట్టర్‌ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న చాంద్‌పాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు సహేద్‌, సమీర్‌, బావమరిది ఖలీల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో చాంద్‌బాషా, సబీరా బేగం, ఖలీల్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారులు ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు.

ఢిల్లీలో మహిళలపై ఆగని అత్యాచారాలు, తాజాగా 13 ఏళ్ల బాలికపై విరుచుకుపడిన కామాంధుడు, ఆపై హత్య చేసి దహన సంస్కారాలు వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు బెదిరింపులు

వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షఫీయే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చాంద్‌పాషా కుమార్తె రుబీనా పోలీసులకు తెలిపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చాంద్‌పాషా ఇంటి పరిసరాలను క్లూస్‌టీం పరిశీలించింది.

(The above story first appeared on LatestLY on Sep 01, 2021 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).