Telangana Shocker: అచ్చంపేటలో దారుణం, మద్యం తాగించి ఇద్దరు మహిళలపై అత్యాచారం, కారులోనే లైంగిక దాడి
మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రయోజనం ఉండటం లేదు. దేశంలో ఏదో చోట, ఎక్కడో మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారం లేదా లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన సంఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.
Hyd, July 16: మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రయోజనం ఉండటం లేదు. దేశంలో ఏదో చోట, ఎక్కడో మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారం లేదా లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన సంఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.
రోజు వారి కూలి పనిచేసే ఇద్దరు మహిళలపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపిన కథనం ప్రకారం... బల్మూర్ మండల ప్రాంతానికి చెందిన (35) ఏళ్ల ఇద్దరు మహిళలు కుటుంబాన్ని పోషించడం కోసం కూలి పని చేస్తున్నారు. ఎప్పటిలాగే అడ్డా మీద ఉన్న వీరిని తమ ఇంట్లో పని కోసం పిలిచారు టైల్స్ దుకాణ యజమని వినోద్ సింగ్, అతడి స్నేహితుడు గజానంద్.
ఇంట్లో పని పూర్తయ్యాక వారిని కారులో ఎక్కించుకుని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో మద్యం తాగించారు. అనంతరం ఇద్దరు కూలీలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో అచ్చంపేట శివారులోని క్రీడా మైదానం సమీపంలో మహిళలను వదిలేయగా అపస్మారక స్థితిలో వీరిని గమనించి స్థానికులు డయల్ 100, 108లకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత మహిళల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు
(The above story first appeared on LatestLY on Jul 20, 2024 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

