Telangana Shocker: నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
Hyd, Mar 20: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెల్లి చేసుకోవాలని యువతిని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని యువతి కోరినా యువకుడు పట్టించుకోలేదు.
అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్‌చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకు అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువచ్చారు.
అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం యువతి మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 20, 2023 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

