Telangana: భార్యపై అనుమానంతో బెడ్ రూంలో కెమెరా, అది తెలియక ప్రియుడితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే..

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త దాన్ని నిర్థారించుకునేందుకు బెడ్ రూంలో సీసీ టీవీ కెమెరాను అమర్చారు. అది తెలియని భార్య తన ప్రియుడితో కలిసి రాసలీలలు (secret affair) చేస్తూ దొరికిపోయింది.

Telangana: భార్యపై అనుమానంతో బెడ్ రూంలో కెమెరా, అది తెలియక ప్రియుడితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే..
TRS local leader held for kidnap and assault over 'secret affair' (Photo-Video Grab)

Hyd, Sep 29: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త దాన్ని నిర్థారించుకునేందుకు బెడ్ రూంలో సీసీ టీవీ కెమెరాను అమర్చారు. అది తెలియని భార్య తన ప్రియుడితో కలిసి రాసలీలలు (secret affair) చేస్తూ దొరికిపోయింది. అయితే ఈ ఘటనలో భార్యను భర్త నిలదీసినందుకు అతడిని టీఆర్ఎస్ లోకల్ నేత (TRS local leader) కిడ్నాప్ చేశారు.

దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్‌ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రాజు.. తన భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్‌ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు.

ముంబైలో దారుణం, బుర్ఖా ధరించలేదని భార్యను కిరాతకంగా పొడిచి చంపిన భర్త, నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అదే రోజు ప్రియుడు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్‌ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్‌లోకి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు.

ఈమేరకు ఎస్‌ఐ సుభాశ్‌ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్‌ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్‌ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ నేత, అమీన్‌పూర్‌ కోప్షన్‌ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 29, 2022 01:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).