Telangana: రోజూ తాగి వస్తున్నాడని భర్త చేతులు కాళ్లు కట్టేసి నిప్పు కర్రతో వాతలు పెట్టిన భార్య, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

తెలంగాణలోని నిజామాబాద్ సారంగాపూర్ కు చెందిన మహేష్ (33) అనే వ్యక్తి తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ 6-టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప తండాకు చెందిన మహేష్ మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా భార్య సునీతతో గొడవపడేవాడని తెలిపారు.

Telangana: రోజూ తాగి వస్తున్నాడని భర్త చేతులు కాళ్లు కట్టేసి నిప్పు కర్రతో వాతలు పెట్టిన భార్య, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
crime-scene

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణలోని నిజామాబాద్ సారంగాపూర్ కు చెందిన మహేష్ (33) అనే వ్యక్తి తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ 6-టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప తండాకు చెందిన మహేష్ మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా భార్య సునీతతో గొడవపడేవాడని తెలిపారు.  ఇదేమి త్యాగం బాబోయ్, రెండో సంతానం కోసం భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు, పెళ్లి పత్రికను చూశారా..

టైమ్స్ ఆఫ్ ఇండియా (TOl) నివేదించిన ప్రకారం, మహేష్ కుటుంబం అతని తీవ్రమైన మద్యపాన అలవాటు గురించి గతంలో హెచ్చరించిందని అతనిని మానుకోవాలని కోరారు. అయితే జూన్ 23న మహేష్ మరోసారి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనికి ప్రతిగా అతని భార్య అతని చేతులు, కాళ్ళను తాడుతో కట్టివేసి, కాలుతున్న చెక్క ముక్కతో అతని శరీరంపై వాతలు పెట్టింది. ఈ సంఘటన జరిగినప్పటికీ, భార్య సునీత భర్త మహేష్ గాయాలకు చికిత్స చేసింది. అప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉన్నాడు. ఏమైందో ఏమో మహేష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. TOL నివేదించిన ప్రకారం, ఈ సంఘటనకు సంబంధించి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

(The above story first appeared on LatestLY on Jun 30, 2024 10:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).