ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భర్తకు దగ్గరుండి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. ఆమె మళ్లీ గర్బం దాల్చలేదు. అయితే, తనకు రెండో సంతానం కావాలని భర్త ఆశపడటంతో ఆయన ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేసి ఆయన కోరికను తీర్చారు.

లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు. వివాహానికి ఆహ్వాన పత్రికలను వేయించి.. భర్తకు మూడో పెళ్లి చేశారు. పెళ్లికి పెద్దలుగా ఇద్దరు భార్యలు వ్యవహరించి.. అంగరంగ వైభవంగా జూన్ 25న వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో వధూవరుల ఫోటోతో పాటు తమ ఫోటోలను కూడా ఇరువురు భార్యలు వేయించడం గమనార్హం. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.  కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)