Telangana: ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో విషాదం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి
తెలంగాణలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్ (family planning surgery) చేయించుకున్న మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది.
Hyd, Sep 8: తెలంగాణలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్ (family planning surgery) చేయించుకున్న మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకున్న నలుగురు మహిళలు మృతిచెందడం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్‌లోని పేట్లబురుజు ఆస్పత్రిలో రెండ్రోజుల క్రితం ఓ మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం మహిళకు వాంతులు, విరోచనాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు (Woman die after family planning surgery) విడిచారు. అయితే, ఈ మహిళ మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఘటనపై అధికారులు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న డీఎంఈ రమేశ్‌రెడ్డి పేట్లబురుజు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, శస్త్రచికిత్సలో పాల్గొన్న సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ ఘటన ఎలా జరిగింది? కు.ని శస్త్రచికిత్సే మహిళ మృతికి కారణమా? తదితర వివరాల గురించి ఆరా తీసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Sep 08, 2022 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

