Telangana COVID Status: తెలంగాణలో కొత్తగా మరో 149 కోవిడ్ కేసులు నమోదు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొనసాగుతున్న టీకాల పంపిణీ, ఇప్పటివరకు వ్యాక్సిన్ చేయించుకున్నది కేవలం 38 శాతం మాత్రమే

టీకా కోసం తమ పేరు నమోదు చేసుకున్న వారిలో చాలా తక్కువ మంది టీకాలు వేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లలలో ఇప్పటివరకు కేవలం 38 శాతం మంది మాత్రమే టీకా కోసం ముందుకొచ్చారు. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 8 వరకు అధికారిక గణాంకాల ప్రకారం....

Telangana COVID Status: తెలంగాణలో కొత్తగా మరో 149 కోవిడ్ కేసులు నమోదు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొనసాగుతున్న టీకాల పంపిణీ, ఇప్పటివరకు వ్యాక్సిన్ చేయించుకున్నది కేవలం 38 శాతం మాత్రమే
COVID-19 Vaccine (Photo Credits: Twitter)

Hyderabad, February 9: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే టీకా కోసం తమ పేరు నమోదు చేసుకున్న వారిలో చాలా తక్కువ మంది టీకాలు వేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లలలో ఇప్పటివరకు కేవలం 38 శాతం మంది మాత్రమే టీకా కోసం ముందుకొచ్చారు. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 8 వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 2,28,845 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 31,831 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 149 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 745 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,95,831కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 9 మరియు రంగారెడ్డి నుంచి 8  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,612కు పెరిగింది. అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 186 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,92,415 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1804 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Feb 09, 2021 10:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).