Shilpa Chowdary Arrest: అధిక వడ్డీ పేరుతో ముగ్గురు టాలీవుడ్ హీరోలను బురిడీ కొట్టిన కిలాడీ, కిట్టీ పార్టీలు, పేజ్ త్రీ పార్టీలతో కోటీశ్వరులకు దగ్గరైన శిల్పా చౌదరి, రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు అనుమానం
కిట్టీ పార్టీలు, పేజ్ త్రీ పార్టీల పేరుతో ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు, మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లను మోసం చేసిన కిలాడీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు దగ్గరై…వారి నుంచి ఏకంగా రూ 200 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు.
Hyderabad November 27: కిట్టీ పార్టీలు(Kitty Party), పేజ్ త్రీ పార్టీల పేరుతో ముగ్గురు టాలీవుడ్(Tollywood) యంగ్ హీరోలు, మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లను మోసం చేసిన కిలాడీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు దగ్గరై…వారి నుంచి ఏకంగా రూ 200 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు. మాయమాటలతో కోటీశ్వరులను బుట్టలో వేసుకుంటున్న ఈ కిలేడీ పేరు శిల్పాచౌదరి(Shilpa Chowdary). కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది.
శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగ్ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న శిల్పా చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్(Producer) నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్దకోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతోంది.
శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే మహిళా బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. తనతో పాటు అనేక మంది వద్ద శిల్పా చౌదరి దాదాపు వంద కోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తనకు తెలిసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు గండి పేట లోని సిగ్నేచర్ అపార్ట్మెంట్ కు వెళ్లి శిల్పాను అరెస్టు చేశారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు బాధితులు తరలి వస్తున్నారు.
అయితే శిల్పా చౌదరి మాయమాటలకు మోసపోయిన వారిలో ముగ్గురు హీరోలు(Tollywood Actors) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మోసపోయినవారి జాబితాలో ఇంకా వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లు, రియాల్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు. అధిక వడ్డి ఇస్తానని, నల్లధనాన్ని మార్పిస్తానని శిల్పా చౌదరితో పాటు ఆమె భర్త కూడా ప్రముఖులను మోసం చేసినట్లు గుర్తించారు.
(The above story first appeared on LatestLY on Nov 27, 2021 09:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

