TGEAPCET Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సహా ఎలా పూర్తి చేయాలో వివరాలిగో
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో (B tech) ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ (Counselling)ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
Hyderabad, July 04: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో (B tech) ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ (Counselling)ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసువాల్సి ఉంటుంది. వారికి ఈ నెల 19న లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. కాగా, గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్‌సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్‌సైట్ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈసారి ఎప్‌సెట్ వెబ్‌సైట్ www.eapcet.tsche.ac.inలోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు.
ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ).
తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్: జూలై 04 నుంచి 12 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: జూలై 06 నుంచి 13 వరకు
ఆప్షన్ల ఎంపిక: జూలై 08 నుంచి 15 వరకు
ఆప్షన్ల ఫ్రీజింగ్: జూలై 15
సీట్ల కేటాయింపు: జూలై 19
సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 19 నుంచి 23 వరకు
(The above story first appeared on LatestLY on Jul 04, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

