Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం
వాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad, DEC 07: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై (TankBund) ఎయిర్ షో (Air Show) నిర్వహించనున్నారు. ఈ ఎయిర్‌షో 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. ఎయిర్ షోలో భాగంగా వాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
(The above story first appeared on LatestLY on Dec 07, 2024 11:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

