Traffic Restrictions In Hyderabad:హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు
ఎల్బీస్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాలలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
Hyderabad, DEC 20: ఎల్బీస్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాలలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. దీంతో స్టేడియం పరిసరాలలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు వాహనాలకు అనుమతులుండవు.
పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్ లేదా రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంపు వైపు వాహనాలకు అనుమతి లేదు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎస్‌బీఐ, గన్‌పౌండ్రీ వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు.
(The above story first appeared on LatestLY on Dec 20, 2024 10:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

