Training Helicopter Crashes: నల్గొండ జిల్లాలో విషాదం, తుంగతుర్తిలో కూలిన ట్రైనీ హెలికాప్ట‌ర్, మహిళా పైలెట్ సహా మరొకరు మృతి
హెలికాప్టర్ ప్రమాదం (Image: Twitter)

తుంగతుర్తి: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ట్రైనీ హెలికాప్టర్ (శిక్షణ విమానం) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పెద్దవూర మండలంలోని తుంగతుర్తి సమీపంలో శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణనిచ్చే ట్రైనీ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. హెలికాప్టర్ లో ఉన్న మహిళా పైలెట్ , ట్రైనీ పైలెట్ ఇద్దరు దుర్మరణం చెందారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

ఉదయం 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో తుంగతుర్తి గ్రామస్తులు భయపడ్డారు. ఆ సమయంలో వ్యవసాయ పనులకు వెళుతున్న కొంతమంది ఆకాశం నుండి ఎదో పడినట్లు అనిపించడంతో వెంటనే ఇతర గ్రామస్తులకూ ఈ విషయాన్ని తెలిపారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.