Krishnaiah Murder Case: టీఆర్‌ఎస్‌ నేత హత్యకేసులో ఆరుగురు అరెస్ట్, ఇంకా పరారీలోనే తమ్మినేని వీరభద్రం సోదరుడు, హత్యకు ఉపయోగించిన కత్తులు స్వాధీనం, రాజకీయ కక్షలే హత్యకు కారణమని నిర్ధారణ

ఖమ్మంలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి (Teladarupalli) చెందిన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్యను (TRS leader Tammineni Krishnaiah) ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం తెలిసిందే. రాజకీయ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

Krishnaiah Murder Case: టీఆర్‌ఎస్‌ నేత హత్యకేసులో ఆరుగురు అరెస్ట్, ఇంకా పరారీలోనే తమ్మినేని వీరభద్రం సోదరుడు, హత్యకు ఉపయోగించిన కత్తులు స్వాధీనం, రాజకీయ కక్షలే హత్యకు కారణమని నిర్ధారణ
TRS leader Krishnaiah murdered brutally in broad daylight in Khammam (Photo-Facebook)

Khammam, AUg 18: ఖమ్మంలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి (Teladarupalli) చెందిన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్యను (TRS leader Tammineni Krishnaiah) ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం తెలిసిందే. రాజకీయ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈనెల 15న ఉదయం తెల్దారుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం (Tammineni veerabhadram) సోదరుడైన తమ్మినేని కోటేశ్వరరావు (Thamminni koteswararao) ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. అదేరోజు కృష్ణయ్య అనుచరులు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి దిగారు.

Andhra Pradesh Shocker: పోలీసులమంటూ పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు 

అయితే.. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు. హత్యకేసులో ప్రమేయమున్న ఆరుగురు నిందితులను గురువారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

TRS Leader Murder: టీఆర్ఎస్ నేతను హత్య చేసి రెండు చేతులను తీసుకెళ్లిన దుండగులు,తెల్దారుపల్లిలో దారుణ హత్య కలకలం, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు 

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏ2 రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్యలు ఉన్నారు. అయితే ప్రధాన నిందితులైన ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 జక్కంపూడి కృష్ణలు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీకోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 18, 2022 09:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).