TRS Leader Murder: టీఆర్ఎస్ నేతను హత్య చేసి రెండు చేతులను తీసుకెళ్లిన దుండగులు,తెల్దారుపల్లిలో దారుణ హత్య కలకలం, 144 సెక్షన్ విధించిన పోలీసులు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు.
Khammam,Agust 15: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు. కాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య (TRS leader Krishnaiah ). అయితే సీపీఎంతో విభేదించి.. టీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.
పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసి బైక్‌పై వెళ్తున్న కృష్ణయ్యను పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు హత్యచేశారు. ఈఘటనలో కృష్ణయ్య స్పాట్‌లోనే చనిపోయారు. దుండగులు హత్య అనంతరం మృతుడి రెండు చేతులను తీసుకెళ్లారు. అయితే హత్యకు ముందు బైక్ డ్రైవింగ్ చేస్తున్న ముత్తయ్యను బెదిరించి పంపించారు. ఆ తర్వాత కత్తులతో ఏకధాటిగా దాడి చేశారు.
దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెల్దారుపల్లికి చెందిన ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య నేపథ్యంలో తెల్దారుపల్లిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
కాలం చెల్లిన కొంతమంది ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇలాంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. వ్యక్తిగత ఎదుగుదల చూడలేక ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అభిమానులు సహకరించాలని కోరారు.
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 06:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

