TRT Notification: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం 5089 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (PET) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ (Notification) జారీచేసింది.

TRT Notification: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం 5089 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
Representational Image (Credits: Google)

Hyderabad, SEP 08: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (PET) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ (Notification) జారీచేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Meghalaya CM Sangma Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన మేఘాలయ సీఎం సంగ్మా 

మొత్తం పోస్టులు: 5089

ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, లాంగ్వేజ్ పండిట్‌ 611, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హత: బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి.

వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

రాతపరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 21

ఆన్‌లైన్‌ రాత పరీక్ష: నవంబర్‌ 20 నుంచి 30 వరకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in

(The above story first appeared on LatestLY on Sep 08, 2023 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).