Good News For TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం

ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు.

Good News For TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం
VC Sajjanar (Photo-Twitter)

Hyd, June 1: ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను తాజాగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని వారు ప్రకటించారు.

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ రెండో వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపిన వాతావరణ శాఖ

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వారు ప్రకటించారు.

హైదరాబాద్‌ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాలకు వెళ్లేవారు బీ అలర్ట్, ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన ట్రాఫిక్ పోలీసులు...ఆంక్షలు ఎక్కడెక్కడంటే?

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని బాజిరెడ్డి గోవర్థన్‌, సజ్జనార్‌ లు తెలిపారు

(The above story first appeared on LatestLY on Jun 01, 2023 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).