TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి భారీ డిస్కౌంట్లు, www.tsrtconline.in లో వివరాలు చూడాలని తెలిపిన ఎండీ సజ్జనార్
ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.వారికి ప్రత్యేక రాయితీలను (TSRTC announces special discounts) ఇస్తున్నట్లు ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే (travelers on advance reservations) టికెట్‌లో 5 శాతం రాయితీ కల్పించింది.
Hyd, Feb 2: ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.వారికి ప్రత్యేక రాయితీలను (TSRTC announces special discounts) ఇస్తున్నట్లు ప్రకటించింది.
31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే (travelers on advance reservations) టికెట్‌లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది.ఈ మేరకు ఆన్‌లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్‌లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు.
(The above story first appeared on LatestLY on Feb 02, 2023 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

