TSRTC: ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలు ఈ మేరకు తగ్గనున్నాయి.
ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా ఛార్జీని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు.
వీడియో ఇదిగో, షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

