Pragathi Bhavan: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పోలీసులు వేధిస్తున్నారని.. సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.
Hyderabad, June 8: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.
ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.తన ఇంటి విషయంలో కొంపెల్లి సీఐ మహేశ్ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు సదరు వ్యక్తి తెలిపాడు. ఈ విషయమై సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సంబంధిత బిల్డర్‌తో పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించాడు.
Here's Video
A youth doused himself with flammable liquid outside Telangana CM’s residence, Pragathi Bhavan in #Hyderabad. Another person, his accomplice, jumped in front of a minister’s convoy. Both arrested, minutes before the state cabinet meeting began. pic.twitter.com/S3qfzT4CDC
— Rahul Devulapalli (@rahulscribe) June 8, 2021
పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు. బాధితుడి పేరు నర్సింగరావు కాగా, నివాసం మేడ్చల్ దగ్గర కొంపల్లి అని తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Jun 08, 2021 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

