Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన కేంద్రం, నిరసనలతో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, సరిపడా బియ్యం, గోదుమలు నిల్వ ఉన్నాయన్న సర్కారు
: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం కొనలేమని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్ రైస్ తీసుకోమని, వాటిని నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది.
Hyderabad November 18: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం కొనలేమని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్ రైస్ తీసుకోమని, వాటిని నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది. రైతులు వరి, గోధుమకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని, నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగు చేయాలని సూచించింది. అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తున్నామని తెలిపింది.
ప్రస్తుతం రబీ పంట సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఎంత బియ్యం సేకరించాలో నిర్ణయిస్తామని చెప్పింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విధంగా డిమాండ్ ఉంటుందని, గత నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరించామని, ఇకపై కొనమని చెప్పింది. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఎగుమతి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న కేంద్రం, ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పింది.
రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని, నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగు చేయాలని, అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తున్నామన్నది. రాష్ట్రాలు సేకరించేంత వరకే పరిమితం కావాలని చెప్పింది. గతంలో తెలంగాణ నుంచి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు, 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ధాన్యం, బియ్యం సేకరణ జరుగుతున్నట్లు ఆహార, వినియోగదారుల మంత్రిత్వ శాఖ వివరించింది.
(The above story first appeared on LatestLY on Nov 18, 2021 09:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

