TS Health Bulletin: మరో రెండు రోజుల పాటు ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్, ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1985గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య
ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ జరగనుంది....
Hyderabad, February 4: తెలంగాణలో తొలివిడత వ్యాక్సినేషన్ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేడు మరియు రేపు ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 3 వరకు 1,76,550 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇందులో ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది 1,09,161 ఉండగా, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందిలో కేవలం 58,137 లబ్దిదారులు మాత్రమే ఉన్నారు.
ఇక, ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ జరగనుంది.
ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 41,343 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 177 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1323 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,95,101కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 11 మరియు మేడ్చల్ నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

అలాగే గత 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,606కు పెరిగింది. అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 198 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,91,510 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1985 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 04, 2021 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

