Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.
Hyderabad, Sep 10: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) మరో రైలు తెలంగాణలో (Telangana) ప్రారంభం కానున్నది. తెలంగాణ నుండి ఇప్పటికే పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా, ఐదో రైలు పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్దమవుతోంది. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రైలు టైమింగ్స్, ఇతరత్రా వివరాలు ఇలా..
- సేవలు అందించే నగరాలు- సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య
- మొత్తం దూరం-578 కిలోమీటర్లు
- పట్టే సమయం- ఏడు గంటల 15 నిమిషాలు
- షెడ్యూల్ - నాగ్ పూర్‌లో ఉదయం 5 గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ కు రాక, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్ పూర్ కు చేరిక.
- ఆగే స్టేషన్లు-కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్
భారత్‌లో మంకీపాక్స్ కేసు, వైరస్ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
(The above story first appeared on LatestLY on Sep 10, 2024 08:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

