Weather Forecast: బయటకు వస్తే మాడిపోవాల్సిందే, హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు, బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సూర్యభగవానుడు చెలరేగిపోతున్నాడు. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖైరతాబాద్‌లో 40.1, శేరిలింగంపల్లిలో 39.9, షేక్‌పేటలో 38.9, మియాపూర్‌లో 38.7, సరూర్‌నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Weather Forecast: బయటకు వస్తే మాడిపోవాల్సిందే, హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు, బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
Representative (Image: Credits: PTI)

తెలంగాణలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సూర్యభగవానుడు చెలరేగిపోతున్నాడు. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖైరతాబాద్‌లో 40.1, శేరిలింగంపల్లిలో 39.9, షేక్‌పేటలో 38.9, మియాపూర్‌లో 38.7, సరూర్‌నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పోలవరం ముంపుపై ఈ నెల 10న కేంద్రం కీలక భేటీ, మూడు రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేయడమే లక్ష్యంగా సమావేశం

రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న 25 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ వెల్లడించింది. కాగా, నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3న గరిష్ఠంగా 69.10 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది.

(The above story first appeared on LatestLY on Apr 05, 2023 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).