Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్
వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.
Hyderabad, June 17: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయం (Telangana Politics) రసకందాయంలో పడింది. ఈ క్రమంలో అధికార (Ruling Party), ప్రతిపక్ష పార్టీ (Opposition Party) నేతల మధ్య మాటలతూటాలు పెళుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జిల్లాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో రేవంత్ తనను అవమానించేలా మాట్లాడారని అన్నారు.
Jogu Ramanna: కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటా..https://t.co/0W5JopJWKa
— News Line Telugu (@NewsLineTelugu) June 17, 2023
క్షమాపణలు చెప్పాలని డిమాండ్
బడుగు, బలహీన వర్గాలకు చెందిన తనను లక్ష్యంగా చేసుకోవడం రేవంత్‌కు తగదన్నారు. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 8 స్థానాల్లో ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయిస్తారని జోగు రామన్న తేల్చి చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jun 17, 2023 08:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

