TS's Health Bulletin: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 152 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,022గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

TS's Health Bulletin: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 152 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,022గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, February 2: తెలంగాణలో ఒకవైపు కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా, వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు 36,058 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 152 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 890 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,94,739కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల నుంచి చెరో 11 కేసుల చొప్పున నమోదయ్యాయి.  రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,602కు పెరిగింది. అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 264 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,91,115 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,022 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది

(The above story first appeared on LatestLY on Feb 02, 2021 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).