Blackmail: సార్.. ఆమె తియ్యని మాటలకు పడిపోయి న్యూడ్ వీడియోలు పంపించా.. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తోంది.. లేకపోతే సోషల్ మీడియాలో పెడుతానంటోంది.. యువతిపై హైదరాబాద్ యువకుడి ఫిర్యాదు
బుజ్జీ, బంగారం అంటూ తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది ఆ మాయలేడీ. ఆపై అబ్బాయి దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేసిన ఆమె.. ఆ వీడియోలను చూపించి యువకుడిని బెదిరించి డబ్బుల కోసం వేధించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
Hyderabad, September 23: నాలుగు రోజుల పరిచయంలోనే బుజ్జీ, బంగారం అంటూ తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది ఆ మాయలేడీ. ఆపై అబ్బాయి దుస్తులు విప్పించి న్యూడ్ (Nude) వీడియో కాల్ (Video Call) చేసిన ఆమె.. ఆ వీడియోలను చూపించి యువకుడిని బెదిరించి డబ్బుల కోసం వేధించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలికి (Gachibowli) చెందిన యువకుడు (26) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని నిత్యం ముచ్చట్లు చెప్పుకునే వరకు వెళ్లింది. యువకుడు తన మైకంలో మునిగిపోయాడని నిర్ధారణకొచ్చిన తర్వాత ఆమె తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. తొలుత వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడింది. మరోసారి దుస్తులు పూర్తిగా విప్పేసి కాల్ చేసింది. అతడిని కూడా దుస్తులు తొలగించమని కోరింది.
అమ్మాయే అలా మాట్లాడితే తానేం తక్కువ కాదని అనుకున్నాడో ఏమో! ఆమె అడిగిందే తడవుగా దుస్తులు విప్పేసి చాలాసేపు మాట్లాడాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న మాయలాడి ఆ వీడియోను క్యాప్చర్ చేసింది. తన చేతికి యువకుడి నగ్న వీడియోలు చిక్కడంతో ఆమె తన అసలు రూపాన్ని బయటపెట్టింది. వీడియోలను అతడికి పంపి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిందేనని బెదిరించింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు పంపాలని మెసేజ్‌లు పంపింది. దీంతో విసిగిపోయిన యువకుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(The above story first appeared on LatestLY on Sep 23, 2022 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

