Tirupati, SEP 22: భర్త పరాయి స్త్రీని కన్నెత్తి చూస్తేనే భార్య తట్టుకోలేదు. ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడుతుందంటే చాలు చీల్చి చెండాడుతుంది. కానీ తన భర్త లవ్ చేశాడని భార్యే దగ్గరుండి పెళ్లి చేయడం చూశారా? ఇవన్నీ సినిమాలో మాత్రమే జరుగుతాయి అనుకోకండి. మన దగ్గర్లో కూడా జరుగుతాయి. తాజాగా మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోనే జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి పెళ్లిళ్లు కూడా అవుతున్నాయి. కొంతమంది ఆన్లైన్ వేదికలనే తమ ప్రేమ పెళ్లిళ్లకు రహదారులుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. తిరుపతిలోని (Tirupati) అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడు టిక్ టాక్ లో (Tik tok) ఇద్దరిని పడేశాడు.
అంతే కాకుండా ఇప్పుడు ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సదరు యువకుడు మొదట విశాఖకు చెందిన ఓ యువతిని టిక్ టాక్ లో (Tik tok) పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డాడు. ఆ తరవాత వీరద్దరూ ప్రేమించుకున్నారు. ఏమైందో కానీ విశాఖ యువతిని దూరం పెడ్డాడు. ఈ గ్యాప్ లో కడప కు చెందిన మరో యువతితో టిక్ టాక్ లోనే పరిచయం ఏర్పడింది.
ఆ యువతితో కూడా లవ్ లో పడ్డాడు. ఇక వీరిద్దరూ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇద్దరి మధ్యలో విశాఖ యువతి వచ్చి చేరింది. అతడు లేకపోతే తాను ఉండలేనని చెప్పింది. అంతే కాకుండా యువకుడు మొదటగా పెళ్లి చేసుకున్న యువతితో అంతా కలిసి హ్యాపీగా ఉందామని ఒప్పించింది. ఇక యువకుడి భార్య కూడా ఒప్పుకోవడంతో బుధవారం వీరి పెళ్లి జరిగింది. అంతే కాకుండా మొదటి భార్య ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త చూసిన నెటిజన్లు ముగ్గురూ కలిసి ఇప్పుడు టిక్ టాక్ చేసుకోవచ్చు అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.