Tamil Nadu, September 22: చెన్నైలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. కొరుకుపేటలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య (Man Hits Grandmother With Hammer) చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా తన నివేదికలో మరణించిన మహిళ నిందితుడి తల్లి అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలను డిమాండ్ చేస్తోందని పేర్కొంది. తన అమ్మమ్మ డబ్బులు తిరిగి అడగడంతో ఆ వ్యక్తి కోపం తెచ్చుకుని ( Monetary Dispute) అమ్మమ్మను హత్య చేసి లోపలి నుంచి తలుపులు వేసి టీవీ చూడటం ప్రారంభించాడు.
మృతురాలిని విశాలాక్షి (70)గా గుర్తించగా, నిందితుడిని సతీష్ (28)గా గుర్తించారు. మృతురాలు సతీష్ అమ్మమ్మ. నిందితుడి అమ్మమ్మ ఇంతకు ముందు అతనికి ఇష్టమైన మధ్యాహ్న భోజనం చేపల కూర, అన్నం పెట్టింది. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో సతీష్ నానమ్మపై బ్లేడుతో దాడి చేసి సుత్తితో దాడి చేశాడు.
ఈ క్రమంలో శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు ఏమైందో తెలుసుకునేందుకు విశాలాక్షి ఇంటికి చేరుకోగా.. టీవీ నుంచి శబ్దం వస్తోందని సతీష్ చెప్పాడు. అనంతరం నిందితుడు తన తల్లికి ఫోన్ చేసి విశాలాక్షి కిందపడి గాయపడిందని చెప్పాడు. మహిళను స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స అందించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి సతీష్ మద్యం మత్తులో టీవీ చూస్తూ (Watches TV As She Bleeds to Death) ఉన్నాడు. ఘటనా స్థలం నుంచి బ్లేడు, సుత్తి వంటి హత్యాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం, సతీష్ తల్లి ఇంటి మరమ్మతు కోసం తన తల్లితో సహా చాలా మంది నుండి డబ్బు అప్పుగా తీసుకుంది. అయితే ఆ డబ్బు చెల్లించలేక ఇంటిని అమ్మి అప్పు చెల్లించింది. ఆమె తన తల్లికి రూ.లక్ష చెల్లించి, మిగిలిన లక్ష తిరిగి ఇస్తానని చెప్పింది.