WhatsApp New Features: వాట్సాప్ నుంచి 5 అద్భుత ఫీచర్లు, పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్.. త్వరలోనే పలు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ముఖ్యంగా అతి త్వరలో 5 ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. అవేంటో ఓ సారి పరిశీలిస్తే..

WhatsApp New Features: వాట్సాప్ నుంచి 5 అద్భుత ఫీచర్లు, పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే ఫీచర్
WhatsApp (Photo Credit- WhatsApp)

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్.. త్వరలోనే పలు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ముఖ్యంగా అతి త్వరలో 5 ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. అవేంటో ఓ సారి పరిశీలిస్తే..

ఎడిట్

పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకోవడానికి అనుమతించనుంది. పంపించిన 15 నిమిషాల వరకు ఇందుకు గడువు ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది.

గ్రూపు సభ్యుల సంఖ్య

ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులో గరిష్ఠంగా 512 మంది సభ్యులుగా ఉండొచ్చు. త్వరలో దీన్ని రెట్టింపు చేయనుంది. దీంతో ఒకే గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరొచ్చు.

డాక్యుమెంట్ల షేరింగ్ కు క్యాప్షన్

ఇప్పటి వరకు వాట్సాప్ లో మనం ఇమేజ్ , వీడియోలు పంపిస్తుంటే క్యాప్షన్ అడుగుతుంది. కానీ, డాక్యుమెంట్లకు మాత్రం క్యాప్షన్ అడగదు. ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇవ్వొచ్చు.

అణు జలాంతర్గామి నుంచి ఐఎన్‌ఎస్ అరిహంత్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం..

స్క్రీన్ షాట్

ఒకరు పంపించిన సందేశాలను గుర్తు పెట్టుకోవడానికో, లేదంటే ఆధారం కోసమో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. కానీ, స్క్రీన్ షాట్ తీసుకోవడం త్వరలో సాధ్యపడకపోవచ్చు. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఒకరు తమ సందేశాలను స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, పంపించే వారు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.

ప్రీమియం సబ్ స్క్రిప్షన్

వ్యాపారుల వాట్సాప్ వినియోగం పెరుగుతోంది. చెల్లింపులు, ఆర్డర్ల స్వీకరణ, సమాచార, ప్రత్యుత్తరాలు, ఆఫర్లు ఇలా ఎన్నో రకాల సమాచారాన్ని కస్టమర్లతో పంచుకునేందుకు కంపెనీలు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నాయి. ఇక మీదట వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సేవలను వాట్సాప్ అందించనుంది.

(The above story first appeared on LatestLY on Oct 17, 2022 03:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).