Air India Cancels Some US Flights: అమెరికాలో 5జీ విప్లవం, ఎయిర్ ఇండియా విమాన సేవలను ఆపివేస్తున్నట్లు ప్రకటించిన విమానయాన సంస్థ, పలు విమాన కంపెనీ సేవలకు బ్రేక్

అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ (5G rollout) వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు (Air India cancels some US flights) విమానయాన సంస్థ తెలిపింది.

Air India Cancels Some US Flights: అమెరికాలో 5జీ విప్లవం, ఎయిర్ ఇండియా విమాన సేవలను ఆపివేస్తున్నట్లు ప్రకటించిన విమానయాన సంస్థ, పలు విమాన కంపెనీ సేవలకు బ్రేక్
File image of Air India flight (Photo Credits: IANS)

అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ (5G rollout) వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు (Air India cancels some US flights) విమానయాన సంస్థ తెలిపింది. అమెరికాలో ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రాంతాలలో 5జీ టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేస్తుండటం వల్ల జనవరి 19, 2022 నుంచి భారతదేశం-అమెరికాకు వెళ్లే వాటిలో కొన్ని విమానాల టైమింగ్స్ మార్చడంతో పాటు మరికొన్నింటి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా (Air India) తెలిపింది. మిగతా వివరాలు తర్వాత అప్డేట్ చేయనున్నట్లు సంస్థ ట్విటర్ వేదికగా పేర్కొంది.

కాగా ఎటీ అండ్ టీ, వెరిజోన్ కలిసీ కొత్త 5జీ సేవలను (5G Technology) అందించడానికి సిద్ధం అవుతున్నప్పుడు రాబోయే "విపత్కర" విమానయాన సంక్షోభం గురించి ప్రధాన విమానయాన కంపెనీల సీఈఓలు ప్రభుత్వానికి సూచించారు. 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ వల్ల విమాన సేవలు నిలిచిపోతాయని, విమానాల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్లు విమానయాన సంస్థలు హెచ్చరించాయి. కాగా అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం రోల్ అవుట్ చేస్తున్న 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ విమానయాన సేవల మీద వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని, సంక్షోబాన్ని సృష్టిస్తుందని యునైటెడ్ ఎయిర్ లైన్స్ తెలిపింది.

విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..

ప్రతి ఏడాది దేశంలోని 40కి పైగా అతిపెద్ద విమానాశ్రయాల గుండా కనీసం 15,000 విమానాలు 1.25 మిలియన్ల యునైటెడ్ ప్రయాణీకులను, చాలా అవసరమైన వస్తువులను కార్గో విమానాలు రవాణా చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ పేర్కొంది. విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Here's Air India Tweet

మేము భద్రత విషయంలో రాజీపడము. కానీ, ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు వినియోగించే 5జీ టెక్నాలజీని ఇక్కడ వినియోగించాలని మేము అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేకపోతే ఆటోపైలెట్, హెడ్-అప్ డిస్ ప్లేలు, భూభాగ హెచ్చరికలు, పిచ్ నియంత్రణ వంటి ఇతర భద్రతా వ్యవస్థలకు సమాచారాన్ని అందించే కొన్ని విమానాల రేడియో ఆల్టిమేటర్లు మీద ఆ సిగ్నల్స్ ప్రభావం పడుతుంది. అంతిమంగా, పెను ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో హ్యూస్టన్, నెవార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రధాన నగరాల్లో ప్రాంతీయ విమానాలపై గణనీయమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుంది" అని ఆ దేశ విమానయాన సంస్థలు సూచించాయి.

అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ లేఖలో ఇలా రాశారు.. "మా విమానాలు ఎగరడానికి గ్రౌండ్ క్లియర్ చేయకపోతే, విమనాలలో ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడిక్కడే చిక్కుకొని పోవాల్సి వస్తుంది" అని అన్నారు. ఈ 5జీ సిగ్నల్స్ ఆల్టిమీటర్స్ వంటి సున్నితమైన విమాన పరికరాలను ప్రభావితం చేస్తుందని, దృశ్యమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. 1,100కు పైగా విమానాల ప్రయాణం స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు సంస్థలు సూచిస్తున్నాయి. "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి.

ఈ లేఖపై ప్రభుత్వ సంస్థలు వెంటనే వ్యాఖ్యానించలేదు. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న ఎటీ అండ్ టీ, వెరిజోన్ విమానయాన భద్రతను దృష్టిలో ఉంచుకొని 5జీ నెట్వర్క్ విస్తరణను రెండు వారాలపాటు పొడిగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత అక్కడ 5జీ టవర్స్ ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి.

(The above story first appeared on LatestLY on Jan 19, 2022 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).