October 1: దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ భారీ ఆఫర్లకు తెరలేపింది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఆ సైట్లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్ఈడీ టీవీని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఈ టీవిని చౌక ధరకే పొందాలనుకునేవారు ఈ రోజు రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాల్సి వుంది. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చునని అమెజాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే, ఆఫర్స్ డిస్కౌంట్ ఉన్నాయి. కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే కార్డు కలిగిన కస్టమర్లు కనీసం రూ.3,000 వరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఈఎంఐలపైనా ఈ ఆఫర్స్ పొందొచ్చు. రూ.50,000 లోపు షాపింగ్ చేస్తే ఒక కార్డుపై గరిష్టంగా రూ.2,000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది.రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఆ తర్వాత ప్రతీ రూ.10,000 అదనంగా బోనస్ ఆఫర్ కింద రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.