Fake iPhone On Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ మోసం, రూ.93 వేలు పెట్టి ఐఫోన్ 11 ప్రో ఆర్డర్ చేస్తే నకిలీ ఫోన్ పంపించారు, వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్, కొత్త ఫోన్ ఇస్తామని తెలిపిన ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం
ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది.
Bengaluru,December 14: ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది. కర్నాటక రాజధాని బెంగళూరులో(Bengaluru) భారీ మోసం వెలుగుచూసింది. రూ.93వేలు చెల్లించి ఐఫోన్ (iPhone) ఆర్డర్ చేస్తే యాజమాన్యం నకిలీ ఫోన్ డెలివరీ చేశారు.
బెంగళూరుకి చెందిన రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐఫోన్-11 ప్రో(iPhone 11 Pro) కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు. దీని కోసం రూ.93వేలు చెల్లించాడు. కొన్ని రోజులకు డెలివరీ వచ్చింది. అయితే బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న వస్తువును చూసి షాక్ తిన్నాడు. అందులో వచ్చిన ఫోన్‌ను పరిశీలించి చూస్తే.. అది నకిలీ ఐఫోన్ అని తేలింది.
ఐఫోన్ 11 ప్రోకు ఉన్న ట్రిపుల్ కెమెరా సెన్సర్లను ఆ ఫోన్ కు అతికించి ఉండడం గమనించాడు. ఫోన్ ఆన్ చేసి చూస్తే అసలు అది ఐవోఎస్ తో పనిచేసే ఫోన్ కాదని తేలింది. దీంతో వెంటనే అతడు ఫ్లిప్ కార్ట్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం..కొత్త ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Dec 14, 2019 12:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

