Best Smartphones of 2021: ఈ ఏడాది మార్కెట్లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కంపెనీలకు కాసుల వర్షం కురిపించిన ఫోన్లను ఓ సారి చూద్దామా..
2021లో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటాడినప్పటికీ పలు రకాల ఫోన్లను (Best Smartphones of 2021) అందుబాటులోకి తీసుకువచ్చాయి.
2021లో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటాడినప్పటికీ పలు రకాల ఫోన్లను (Best Smartphones of 2021) అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత్ లో కాసుల వర్షాలను కురిసింది. 2021 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది. 2021లో వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ (Best Smartphones of 2021) జాబితాను ప్రముఖ టెక్ వెబ్‌సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ నిలిచాయి.
ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్‌ప్లే పరంగా మిగతా స్మార్ట్‌ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ జీటీ 5వ స్థానంలో నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. దీని అమ్మకాలు కూడా బాగా జరిగాయి.వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్‌లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్‌ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి.
షియోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా నిలిచింది. శామ్‌సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి. కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ ఫోన్లో ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Dec 10, 2021 02:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

