ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ అంటూ (man pretends to be his son) అక్కడ కొందమంది నంబర్లకు హ్యాకర్లు మెసేజ్ పంపించారు. తల్లిదండ్రులు ఆ మెసేజ్ చూపి తమ పిల్లలే మెసేజ్ పెట్టారనుకుని వారితోఛాలింగ్ చేయడం చేశారు.
ఫేక్ నంబర్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ ల ద్వారా హ్యకర్లు అచ్చం వారి పిల్లల్లాగే మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఇరుక్కున్నామని ఛాట్ చేయడం, వారిని ప్రమాదం నుంచి కాపాడేందుకు వారికి అడిగినంత పంపడం జరిగింది. అలా డబ్బులు పంపిన వెంటనే ఆ మెసేజ్‌లు పంపిన వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయిపోతుంది. అలా వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులను దోచుకున్న సంఘటనలు ఇటీవల యూకె(ఇంగ్లాండ్)లో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి వాట్సాప్ మెసేజ్‌లతో యుకేలో ఓ వ్యక్తి 7000 ( సుమారు రూ.7లక్షలు) పౌండ్లు (loses £ 7,000 to a scammer in UK) పోగొట్టుకున్నాడని ది మిర్రర్ తెలిపింది. అలాగే ఇంకో వ్యక్తి ఏకంగా 5,000 పౌండ్లు( సుమారు రూ.5 లక్షలు), మరో వ్యక్తి 3,000 పౌండ్లు(రూ.3 లక్షలు) పోగొట్టుకున్నారని తెలిపింది. సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రులు, వారి పిల్లల గురించి సమాచారం సేకరించి అక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే భారతదేశంలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులనే కాక, మిత్రులను కూడా మోసగాళ్లు టార్టెట్ చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక వ్యక్తి అకౌంట్‌ని పోలి ఉన్న పేరు లొగోతో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆన్‌లైన్ మోసగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అవి నిజమని నమ్మి.. తమ మిత్రుడిని ఆపద నుంచి రక్షిద్దామని భావించి.. డబ్బులు పంపినవారు మోసపోతున్నారు. ఈ విషయంలో వాట్సాప్, మెసెంజర్ యాజమాన్యాలు భద్రతాపరంగా ఎంతో అప్డేట్ అయినప్పటికీ.. యూజర్లు కూడా కొంత జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు కోరుతున్నారు. డబ్బులు పంపేముందు ఆ మెసేజ్‌లు పంపింది తమ పిల్లలో కాదో ఒకసారి ధృవీకరించుకోవాలని వారు చెబుతున్నారు.