Bulletproof iPhone 13 Pro:ఈ ఐఫోన్ వెరీ వెరీ స్పెషల్, బుల్లెట్ తగిలినా చెక్కు చెదరని స్మార్ట్ ఫోన్, లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసిన కేవియర్
బుల్లెట్ తగిలినా కూడా చెక్కుచెదరని ఐఫోన్‌ను తయారు చేస్తోంది ఇటలీకి చెందిన ఓ కంపెనీ. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్(Bulletproof) కంపెనీ కేవియర్ స్టీల్త్ ఐఫోన్(Caviar Stealth) పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది.
Italy December 16: సాధారణంగా ఆఫీస్ టేబుల్ మీద నుంచి కింద పడితేనే పనికి రాకుండా పోతాయి కొన్ని స్మార్ట్ ఫోన్లు(Smart Phones). అయితే బుల్లెట్ తగిలినా కూడా చెక్కుచెదరని ఐఫోన్‌ను తయారు చేస్తోంది ఇటలీకి చెందిన ఓ కంపెనీ. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్(Bulletproof) కంపెనీ కేవియర్ స్టీల్త్ ఐఫోన్(Caviar Stealth) పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది. గతేడాది ఐఫోన్ 12(iPhone 12)లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్(caviar).. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్(Stealth) 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది.
స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్(Bulletproof) కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్‌పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్(Caviar) ఈ ఐఫోన్‌ను పైప్యానెల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ.
సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ లోపలి నుంచి ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. అంతేకాదు.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేస్తుంది. బుల్లెట్‌ప్రూఫ్(Bulletproof) ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్‌లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలింది.
ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లను మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది.
2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో కేవియర్ (1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్‌లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది.
(The above story first appeared on LatestLY on Dec 16, 2021 03:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

