Flipkart: ఐఫోన్లపై రూ.10 వేలు తగ్గింపు, భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో (Flipkart Big Bachat Dhamaal sale) స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో (Flipkart Big Bachat Dhamaal sale) స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో (Best deals on iPhone 12 mini) అందిస్తోంది.భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్‌కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు.
వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్‌ఫోన్‌లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్.
పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్‌ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499.
ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్‌లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్‌లు ఉన్నాయి.
పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది.
ఐఫోన్ 12 మిని : 5.4 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఏ14 బయోపనిక్ సాక్, 12 ఎంపీ డ్యూయల్ కెమెరా ప్రధాన ఫీచర్లు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ 12,500 వరకు ఎక్స్చేంజ్ డీల్.
ఐఫోన్ 13 మిని : 128 జీబీ స్టోరేజ్ మోడల్‌పై 7 శాతం తగ్గింపుతో దాదాపు 65,299లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. గతంలో వెబ్‌సైట్‌లో దీని ధర రూ. రూ. 69,999. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా అదనపు 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 6 నెలల ఫ్రీ గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో 12,500 తగ్గుతుంది. ఈ ఆఫర్లనీ అమలైతే ఐఫోన్ 13 మిని సుమారు 55 వేలకు సొంతం చేసుకోవచ్చు.
(The above story first appeared on LatestLY on Jul 01, 2022 07:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

