WhatsApp: మీ దగ్గర ఈ ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే ఇకపై వాట్సాప్‌ను వాడలేరు, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ నిలిపివేయనున్న ఫోన్ల లిస్ట్ ఇదే!
WhatsaApp (Photo Credits: Pxfuel)

New Delhi, FEB 01: మీ దగ్గర అప్ డేట్ అవ్వని స్మార్ట్ ఫోన్ (smart phone) ఉందా? ఫస్ట్ జనరేషన్ యాపిల్ ఐ ఫోన్ తో పాటూ, కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఇకపై వాట్సాప్ (WhatsApp) పనిచేయదు. యాపిల్‌ ఐఫోన్‌ 6 (apple i phone 6), మొదటి జనరేషన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ లేదా పాత ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్ పని చేయదని కంపెనీ తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ పని చేయని ఫోన్ల లిస్ట్ ను హెచ్‌టీ టెక్‌ కంపెనీ రిలీజ్ చేసింది. ఇకపై ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వెర్షన్‌ 4.0.3 లేదా కొత్త వెర్షన్‌ ఉంటేనే వాట్సాప్‌ పనిచేస్తుంది. అలాగే ఐఓఎస్‌ వెర్షన్‌ 12 ఆపై స్థాయివే వాట్సాప్‌ సేవలకు అనుకూలం. దీని కన్నా పాత వెర్షన్‌ ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదు.

Microsoft Services Down: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సర్వీసులు, ఔట్ లుక్ సహా పలు యాప్స్ పనిచేయడం లేదని నెటిజన్ల కంప్లైంట్, టెక్ ప్రపంచంలో గందరగోళం..  

వాట్సాప్‌ పనిచేయని ఫోన్లు ఇవే..

యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌

యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌

యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ(మొదటి జనరేషన్‌)

శామ్‌సంగ్‌ గెలాక్సీ కోర్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏస్‌ 2

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌3 మినీ

శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్రెండ్‌ ఐఐ

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 2

విన్కో డార్క్‌నైట్‌

అర్చొస్‌ 53 ప్లాటినమ్‌

జెడ్‌టీఈ వి956-యుమి ఎక్స్‌2

జెడ్‌టీఈ గ్రాండ్‌ ఎస్‌ ఫ్లెక్స్‌

జెడ్‌టీఈ గ్రాండ్‌ మెమొ

హువావే అసెండ్‌ మేట్‌

హువావే అసెండ్‌ జీ740

హువావే అసెండ్‌ డీ2

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌3 ఐఐ డ్యుయల్‌

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 ఐఐ

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌5

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌3 ఐఐ

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7 ఐఐ

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 డ్యుయల్‌

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7 డ్యుయల్‌

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌2 ఐఐ

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌6

ఎల్‌జీ యాక్ట్‌

ఎల్‌జీ లుసిడ్‌ 2

ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌7

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్‌

లెనోవో ఎ820

ఫెయా ఎఫ్‌1టీహెచ్‌ఎల్‌ డబ్ల్యూ8

వికో సింక్‌ ఫైవ్‌