JIo Fiber Plans: జియో నుంచి కొత్తగా 3 నెలల ప్లాన్లు, రూ.2,097 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి
రిలయన్స్ జియో ఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను (JIo Fiber Plans) అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన ప్లాన్లను (Quarterly Broadband Plans) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో ఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను (JIo Fiber Plans) అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన ప్లాన్లను (Quarterly Broadband Plans) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లు తీసుకునే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కూడా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్, ఇన్‌స్టాలేషన్ చార్జీలు చెల్లించనక్కర్లేదని జియో తెలిపింది.
కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లు రూ.2,097 దగ్గర ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు ఉన్నాయి. అయితే, బేసిక్ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్కవరీ ప్లస్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలైవ్, జీ5 వంటి ఓటీటీ సేవలు రూ.2,997 ప్లాన్‌తో ప్రారంభమయ్యాయి. ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి : రూ.2,097 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 100 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఏమీ లేదు
* రూ.2,997 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 150 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా,ఉచిత వాయిస్ కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్, ఎరోస్ నౌ, హొయ్‌చొయ్, జియో సావన్, జియో సినిమా, లయన్స్ గేట్ ప్లే, షెమారూమీ, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, జీ 5
* రూ.4,497 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 300 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్, ఎరోస్ నౌ, హొయ్‌చొయ్, జియో సావన్, జియో సినిమా, లయన్స్ గేట్ ప్లే, నెట్‌ఫ్లిక్స్(బేసిక్), షెమారూమీ, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, జీ 5
* రూ.7,497 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 500 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్, ఎరోస్ నౌ, హొయ్‌చొయ్, జియో సావన్, జియో సినిమా, లయన్స్ గేట్ ప్లే, నెట్‌ఫ్లిక్స్(బేసిక్), షెమారూమీ, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, జీ 5
* రూ.11,997 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్, ఎరోస్ నౌ, హొయ్‌చొయ్, జియో సావన్, జియో సినిమా, లయన్స్ గేట్ ప్లే, నెట్‌ఫ్లిక్స్(బేసిక్), షెమారూమీ, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, జీ 5
* రూ.25,497 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 1జీబీపీఎస్ వేగంతో నెలకు 6,600 జీబీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్, ఎరోస్ నౌ, హొయ్‌చొయ్, జియో సావన్, జియో సినిమా, లయన్స్ గేట్ ప్లే, నెట్‌ఫ్లిక్స్(బేసిక్), షెమారూమీ, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, జీ 5
(The above story first appeared on LatestLY on Sep 08, 2021 03:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

