Jio Fiber Plans Revamped: జియో కొత్త వ్యూహం, రూ. 399కే జియో ఫైబర్ ప్లాన్, ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ పేరిట కొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించిన జియో

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌కు (JioFiber) సంబంధించి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం (new broadband plans) అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో తెలిపింది. ఇందులో భాగంగా ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌' పేరిట సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేకుండా నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం అవుతాయని జియో తెలిపింది.

ఇప్పటివరకు జియో ఫైబర్‌ ప్లాన్లలో (JioFiber broadband) నిర్దేశిత వినియోగ పరిమితి దాటిన తర్వాత వేగం 1 ఎంబీపీఎస్‌కు పడిపోయేది. కానీ కొత్త ప్లాన్లలో ఇలాంటి పరిస్థితి ఉండదు. అత్యంత చౌకగా రూ.399కి లభించే నెలవారీ ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌/అప్‌లోడ్‌ వేగంతో, రూ.699 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగంతో డాటా లభిస్తుంది. అలాగే 150 ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన రూ.999 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ మినహా 11 ఓటీటీ యాప్స్‌ను, 300 ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన రూ.1,499 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌తో కలిపి 12 ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. మరోవైపు కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు 150 ఎంబీపీఎస్‌ వేగంతో నెల రోజులు ఫ్రీ ట్రయల్‌ను అందజేయనున్నది. ఈ ట్రయల్‌ పీరియడ్‌లో 10 ఓటీటీ యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి. రిలయన్స్ రూ.24,713 కోట్ల డీల్, ప్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను సొంతం చేసుకున్న రిల్, ఈ–కామర్స్‌ రంగంలో పట్టు సాధించేందుకు కొత్త వ్యూహం

కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఫైబర్ ఉచిత ట్రయల్ ని అందిస్తోంది. 150 ఎంబీపీఎస్ వేగంతో 10 ఓటీటీ యాప్స్ ను ఇందులో భాగంగా అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 31 మధ్య జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ ఉచిత ప్రయోజనాలు అందుతాయని జియో తెలిపింది. ట్రయల్ పూర్తయిన తరువాత కనెక్షన్ వద్దనుకుంటే ఎలాంటి ప్రశ్నలు అగడబోమని జియో తెలిపింది. ఇప్పటికే ప్లాన్లలో ఉన్న పాత కస్టమర్లకు ఆటోమేటిగ్గా కొత్త ప్లాన్లకు అప్ గ్రేడ్ అవుతారని జియో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Sep 01, 2020 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).