Layoffs 2024: ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, భారీగా తొలగింపులు ఉంటాయని చెబుతున్న లేటెస్ట్ సర్వే
ఇప్పటికే పోయిన ఏడాది వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రాగా ఈ ఏడాది కూడా భారీగా తొలగింపులు ఉంటాయిని ఓ లేటెస్ట్ సర్వే షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’2024లో భారీ తొలగింపులు ఉంటాయని తెలిపింది.
ఇప్పటికే పోయిన ఏడాది వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రాగా ఈ ఏడాది కూడా భారీగా తొలగింపులు ఉంటాయిని ఓ లేటెస్ట్ సర్వే షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’2024లో భారీ తొలగింపులు ఉంటాయని తెలిపింది.
ఈ సర్వే ప్రకారం... 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి.సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్‌ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. చాలావరకు కంపెనీలు ఆర్థిక మాంద్యం భయాల్లో ఉన్నాయని ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి.
AI రాకతో దినదిన గండంగా ఉద్యోగుల భవిష్యత్తు, 2023లో వేలాది మందిని ఇంటికి సాగనంపిన టాప్ టెక్ కంపెనీలు
ఏఐ యాడ్ టెక్‌కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు.
పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు సర్వేలో తేలింది.
(The above story first appeared on LatestLY on Jan 03, 2024 08:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

