POCO X7 5G, POCO X7 Pro 5G Launched in India: పోకో నుంచి బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్లు, పూర్తి ఫీచర్లు, ధర వివరాలివిగో..
షావోమి అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. పోకో ఎక్స్7 సిరీస్‌లో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా మార్పులు చేశారు.
New Delhi, JAN 09: షావోమి అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. పోకో ఎక్స్7 సిరీస్‌లో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా మార్పులు చేశారు.
పోకో ఎక్స్7 5జీ (Poco X7)
పోకో ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు వస్తాయి. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999; 8జీబీ+256జీబీ ధర రూ.23,999. కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, పోకో ఎల్లో షేడ్స్ రంగుల్లో లభిస్తుంది.
పోకో ఎక్స్7 ప్రో 5జీ (Poco X7 Pro)
పోకో ఎక్స్7 ప్రో 6.73 అంగుళాల 1.5k ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్‌సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో కూడిన హైపర్‌ఓఎస్ 2.0తో వస్తోంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ- 600 సెన్సర్ ఇచ్చారు. ఇందులోనూ 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. పోకో ఎక్స్7 ప్రోలో 6,550 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90W హైపర్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ ధర రూ.26,999; 12జీబీ+256జీబీ ధర రూ.28,999. నెబులా గ్రీన్, ఒబిసిడియన్ బ్లాక్, పోకో యెల్లో కలర్‌వేస్ రంగుల్లో లభిస్తుంది. పోకో ఎక్స్7 ప్రో మోడల్ జనవరి 14 నుంచి, బేస్ మోడల్ జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.2వేలు డిస్కౌంట్ లభిస్తుంది. తొలిరోజు సేల్‌లో ప్రో మోడల్‌పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ కూపన్ అందిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 09, 2025 10:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

