Anil Ambani Plans: అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త వ్యూహం, మార్చి 2020 నాటికి రూ.15వేల కోట్లు క్లియర్, ఇప్పుడు మొత్తం అప్పులు రూ. 93 వేల కోట్లు, రిలయన్స్ క్యాపిటల్ నుంచి నిష్క్రమణ

అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వేల కోట్ల అప్పులు ఓ వైపు.. ఆస్తులను అమ్ముకునేందుకు అనేక అడ్డంకులు మరో వైపు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనిల్ అంబానీ ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే నడిసంద్రంలో చిక్కుకుని బయటకు వచ్చే దారుల కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కునేందుకు అనిల్ అంబానీ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతున్నాడు.

Anil Ambani Plans: అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త వ్యూహం, మార్చి 2020 నాటికి రూ.15వేల కోట్లు క్లియర్, ఇప్పుడు మొత్తం అప్పులు రూ. 93 వేల కోట్లు, రిలయన్స్ క్యాపిటల్ నుంచి నిష్క్రమణ
Rcom to continue clearing dues, next debt repayment to be worth $2.1 billion (photo-Wikimedia Commons )

Mumbai, September 30:  అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వేల కోట్ల అప్పులు ఓ వైపు.. ఆస్తులను అమ్ముకునేందుకు అనేక అడ్డంకులు మరో వైపు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనిల్ అంబానీ ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే నడిసంద్రంలో చిక్కుకుని బయటకు వచ్చే దారుల కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కునేందుకు అనిల్ అంబానీ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతున్నాడు. ఇందులో భాగంగా మార్చి 2020 నాటికి మొత్తంగా రూ.15వేల కోట్లు (2.1 బిలియన్లు) అప్పులను తీర్చాలని అనిల్ అంబానీ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అనిల్ అంబానీ గ్రూపు ADAG ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మార్చి 2018 వరకు రిలయన్స్ గ్రూపు కంపెనీలు చేసిన మొత్తం అప్పులు రూ.1.7లక్షల కోట్లు ఉన్నాయి. అయితే కొన్ని అప్పులను తీర్చివేయండంతో జూలై 2019 నాటికి రూ.93వేల 900లకు వరకు అవి దిగి వచ్చాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మినహా కీలకమైన ఆస్తులు, వ్యాపారానికి సంబంధించిన మొత్తం ఆస్తులను అమ్మిన తర్వాత వచ్చిన మొత్తంలో ఈ అప్పులన్నింటినీ తీర్చేసింది.

కాగా రిలయన్స్ గ్రూపు కంపెనీ జూన్ నెలలో రూ.35వేల కోట్లు లోన్లుగా తీసుకుంది. అందులో ప్రిన్సిపుల్ అమౌంట్ రూ.24వేల 800 కోట్లు ఉండగా.. వడ్డీ చెల్లింపులు మొత్తం రూ.10వేల 600 కోట్లు. ఈ అప్పుల మొత్తాన్ని నిర్దేశించిన సమయానికి అనుగుణంగా 14 నెలల్లో తిరిగి చెల్లించింది.ఈ అప్పులను తీర్చే క్రమంలో అనిల్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎక్కువ మొత్తంలో కోల్పోయాడు. మిగిలిన అప్పులను తీర్చిందుకు తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత షేర్ హోల్డర్లలతో కలిసి మిగతా ఆస్తులను అమ్మేందుకు అనిల్ అంబానీ అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పులిచ్చే వ్యాపారాల నుంచి తమ ఆర్థిక సంస్థ రిలయన్స్ క్యాపిటల్ తప్పుకుంటున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలు రెండెంటిని మూసివేయాలని రిలయన్స్ క్యాపిటల్ నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. ఈ రెండు సంస్థల ఆస్తులు కలిపి మొత్తం రూ.25వేల కోట్ల విలువ ఉంటుందని అంచనా.

(The above story first appeared on LatestLY on Sep 30, 2019 07:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).