Realme GT 6T Launched: అదిరే ఫీచర్లతో రియల్ మీ జీటీ 6టీ 5జీ ఫోన్ వచ్చేసింది, ఆ కార్డు ఉన్నవారికి రూ. 4 వేలు డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో..
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జీటీ 6టీని ఇండియాలో విడుదల చేసింది. మే 29వ తేదీ నుంచి దీన్ని అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించింది. అద్భుతమైన ఎంఓఎల్ఈడీ డిస్ ప్లేతో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ సెన్సర్ తో కూడిన కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది.
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జీటీ 6టీని ఇండియాలో విడుదల చేసింది. మే 29వ తేదీ నుంచి దీన్ని అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించింది. అద్భుతమైన ఎంఓఎల్ఈడీ డిస్ ప్లేతో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ సెన్సర్ తో కూడిన కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది.
రియల్ మీ జీటీ 6టీ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.78 అంగుళాల భారీ ఎంఓఎల్ఈడీ డిస్ ప్లే, ల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో 120 హెట్జ్ రీఫ్రెష్ రేటు సపోర్ట్,అత్యంత అధునాతన స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తో వచ్చింది. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ లతో.. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ మెమరీతో వేర్వేరు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెనుక భాగాన సోనీ ఎల్ వైటీ–600 సెన్సర్ తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వివో నుంచి Y200 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల, ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇవిగో..
మెయిన్ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఉందని కంపెనీ తెలిపింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు.
ఈ ఫోన్ 2జీ నుంచి 5జీ దాకా నెట్ వర్క్ లను సపోర్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. రియల్ మీ వెబ్ సైట్లో, అమెజాన్ లో మే 29వ తేదీ నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ.2,000 బోనస్ ఇస్తారు. అంటే మొత్తంగా రూ.6,000 వరకు డిస్కౌంట్ అందుతుంది.
వేరియంట్ల ధరలు ఇవీ..
8జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ ఉన్న బేసిక్ మోడల్ ధర రూ.30,999
8జీబీ ర్యామ్ 256 జీబీ మెమరీ మోడల్ ధర 32,999
12 జీబీ ర్యామ్ 256 జీబీ మెమరీ మోడల్ ధర 35,999
12 జీబీ ర్యామ్ 512 జీబీ మెమరీ మోడల్ ధర 39,999
(The above story first appeared on LatestLY on May 22, 2024 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

