Jio Extends Diwali offer: రిలయన్స్ జియో శుభవార్త, రూ.699కే జియో ఫోన్ ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు, జియో ఫోన్ వాడేవారి కోసం ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్స్

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా తన జియో ఫోన్‌ను రూ.1500కు కాకుండా కేవలం రూ.699కే సొంతం చేసుకునే ఆఫర్‌ను గతంలోనే జియో ప్రకటించగా. ఇప్పుడా ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు జియో తెలిపింది.

Jio Extends Diwali offer: రిలయన్స్ జియో శుభవార్త, రూ.699కే జియో ఫోన్ ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు, జియో ఫోన్ వాడేవారి కోసం ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్స్
Reliance jio extends Diwali offer: Jio Phone to be sold at Rs 699 till November 30 (Photo-Ians)

Novemebr 3: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా తన జియో ఫోన్‌ను రూ.1500కు కాకుండా కేవలం రూ.699కే సొంతం చేసుకునే ఆఫర్‌ను గతంలోనే జియో ప్రకటించగా. ఇప్పుడా ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ క్రమంలోనే ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్‌కు గడువును పొడిగిస్తున్నట్లు జియో తెలియజేసింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు కూడా కేవలం రూ.699 కే జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.700 విలువైన ఉచిత డేటాను జియో అందిస్తున్నది.

జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ‘ఆల్‌ వన్‌ ప్లాన్‌’ తీసుకొచ్చి విజయాన్ని సాధించిన జియో ఇదే వ్యూహాన్ని జియో ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది. జియోఫోన్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. రూ. 75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి.

(The above story first appeared on LatestLY on Nov 03, 2019 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).